
త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంచి పదవి వస్తుందని, తాను ఇన్ని రోజులు ఆగితే త్వరలోనే మంత్రి పదవి వస్తుందని ఆయన చెప్పారు.
ఇన్ని రోజులు ఆగానని త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పారు. చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.
కానీ ఇప్పుడు ఇవ్వడంలేదని అనేకసార్లు మీడియా సమావేశాల్లో అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా పలుమార్లు మీడియా ముఖంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని మంత్రి పదవి ఉంటే మరింత అభివృద్ధి చేయవచ్చని చెప్పారు.
ఇక ఇప్పుడు మంత్రి పదవిపై పాజిటివ్ గా మాట్లాడటంతో కోమటిరెడ్డికి పదవిపై ఏమైనా సంకేతాలు అందాయా అనే చర్చ జరుగుతోంది.




