
సత్తుపల్లిలో యూనియన్ బ్యాంక్ సామాన్లు జప్తు
Web desc : సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్డు నందుగల యూనియన్ బ్యాంక్ గత 8 ఏళ్లుగా అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ లోని యూనియన్ బ్యాంక్ పై ఇంటి యజమాని చలసాని సాంబశివరావు కోర్టులో దావా వేశారు. పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు తక్షణం అద్దె చెల్లించాలని బ్యాంకు ను ఆదేశించింది.
అయితే కోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గురువారం బ్యాంకులోని సామాగ్రిని జప్తు చేసి ఇంటి యజమానికి డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు జిల్లా కోర్టు సిబ్బంది సత్తుపల్లి పట్టణం లోని యూనియన్ బ్యాంకు లోని కుర్చీలు,టేబుల్స్,కూలర్లు ఇతరత్రా సామాగ్రిని జప్తు చేశారు.
ఈ సందర్భంగా ఇంటి యజమాని చలసాని సాంబశివరావు మాట్లాడుతూ, 2018 నుండి తనకు చెల్లించాల్సిన అద్దెను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని సుమారు రూ.52 లక్షల రూపాయలు తనకు రావాల్సి ఉందని ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించడంతో వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోపు పూర్తి బకాయిని చెల్లించి ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చిన బ్యాంకు అధికారులు పట్టించుకోలేదని, దీంతో ఆగ్రహించిన కోర్టు తక్షణం బ్యాంకు లోని సామాగ్రిని జప్తు చేయాలని ఆదేశించిందని, ఈ క్రమంలోనే బ్యాంకు సిబ్బంది సామాగ్రిని జప్తు చేస్తున్నట్లు తెలిపారు.
2013లో ఆంధ్రా బ్యాంకుకు తన ఇంటిని అద్దెకి ఇచ్చామని 2013 నుంచి 2018 వరకు మాత్రమే అగ్రిమెంట్ ఉందని 2018 తర్వాత అగ్రిమెంట్ రెన్యువల్ చేయించుకోకపోగా అద్దె కూడా చెల్లించకుండా అక్రమంగా తన ఇంటిలో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సుమారు రూ. 52 లక్షల బకాయి రావాల్సి ఉందని సాంబశివరావు తెలిపారు.



