
కారులో భార్యాభర్తల మధ్య గొడవ.. ఆగ్రహంతో భార్యను కొట్టడంతో మృతి
మియాపూర్ : బంధువుల ఇంటికి కారులో వెళుతుండగా దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త చేయి చేసుకోవడంతో భార్య మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంచెపు రారాజు, విజయలక్ష్మికి 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా రారాజు మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ తరుణంలో దంపతులిద్దరూ కారులో బంధువుల ఇంటికి వెళుతుండగా దారిలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహించిన భర్త ఆమెపై చేయి చేసుకున్నాడు.
విజయలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె భర్త సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. విజయలక్ష్మి బంధువు ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.



