
కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి
పాత కక్షలతో వ్యక్తి పై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు
కూసుమంచి : పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన మండలంలోని లోక్య తండాలో శుక్రవారం ఉదయం జరిగింది.
ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. అంతే..ఆ ఫొటోలు, వారి ప్రేమ, పెళ్లి యువకుడి బాబాయిపై ఏకంగా కత్తులు, కర్రలతో దాడిచేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ప్రేమజంట వివాహానికి పెళ్లికొడుకుకు వరుసకు బాబాయి, పిన్నయ్యే వడిత్య హేమ్లా, బుజ్జి కారణమన్న అనుమానంతో పెళ్లికూతురు తరపువారు శుక్రవారం ఉదయం 7గంటల స మయంలో హేమ్లా ఇంటికి వచ్చి కత్తులు, కర్రలతో దాడిచేయడంతో కత్తిపోట్లకు గురయ్యాడు.
అతడిని గ్రామస్థులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కూసుమంచి మండలం లోక్యాతండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. లోక్యాతండాలో ఆ గ్రామ ఆచారం ప్రకారం మూడురోజల పాటు హోళీవేడుకలు జరిగాయి. అందరూ సంబరాల్లో ఉన్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ఓ యువతి, అదేతండాకు చెందిన ఉపేందర్ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇద్దరి కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఎలాగైనా పారిపోయి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
గురువారం అందరూ హోళీ వేడుకల్లో ఉన్న సమయంలో గ్రామం నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. ఆ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌ల్లో పెట్టుకున్నారు. వాటిని చూసిన గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇక తమకూతురు పెళ్లికి.. వరుడికి బాబాయి వరుసైన వడిత్య హేమ్లా, అతడి భార్య బుజ్జి కారణమని అనుమానించి.. యువతి తరుపు బంధువులు హేమ్లా ఇంటిపై దాడికివెళ్లారు.
ఈక్రమంలో హేమ్లా కత్తిపోట్లకు గురవడంతో ఖమ్మం తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. వడిత్య బుజ్జి ఫిర్యాదుమేరకు దాడిచేసిన జర్పుల సాయిచరణ్, తేజావత్ నాగేంద్రబాబు, జర్పులహరిదాసు, జర్పుల నాగమణి, జర్పుల మస్తాన్, జర్పుల విజయ, మూడ్ బుజ్జి తదితరులపై హత్యయత్నం కేసునమోదుచేశామని, నిందితులు పరారీలో ఉన్నారని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు




