
తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
ఇద్దరు మృతి.. గాయపడిన ముగ్గురుని ఆసుపత్రికి తరలించిన తల్లాడ పోలీసులు
ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయములో తల్లాడ మండలం, మిట్టపల్లి సమీపంలోని శంకర్ డాబా వద్ద కల్లూరు నుండి తల్లాడ వైపు వస్తున్న కారు తల్లాడ నుండి కల్లూరు వైపు వెళ్తున్న లారీ డీ కొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న స్థానిక తల్లాడ ఎస్సై (2) వెంకటేష్, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కారులో చనిపోయి ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం మొత్తం మార్చురీ తరలించారు.
కారులో ఉన్న వ్యక్తులు పూరి జగన్నాథ యాత్ర చేసుకొని వస్తునట్లు సమాచారం.. కారులో చనిపోయిన వ్యక్తుల వివరాలు: 1)చిల్లర బాలకృష్ణ (కార్ డ్రైవర్)
2) రాయల అనిల్ వీరి స్వగ్రామం జాఫర్ గాడ్ జనగాం గా గుర్తించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులు అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేష్. ఈ ముగ్గురి స్వగ్రామం స్టేషన్ ఘన్పూర్ ఉప్పుగల్లు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.



