
సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలి
విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్ శివసేన రెడ్డి
విధుల్లో ఆలక్ష్యం వహించిన వార్డెన్ సస్పెండ్
కోచులు అధికారులచే సమీక్షా సమావేశం
సికె న్యూస్ ప్రతినిధి హాకింపేట
ల తెలంగాణ స్పోర్ట్స్అథారిటీ చైర్మెన్ శివసేనరెడ్డి ఈరోజు హకీంపేట లో ఉన్న తెలంగాణ క్రీడా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు.
అన్ని క్లాస్ రూములు తిరిగి విద్యార్థులతో సంభాషించారు.
తరగతి గదులను కిచెన్ రూమ్ ను పరిశీలించారు. అక్కడే పిల్లలకు కలిసి భోజనం చేశారు. అనంతరం అధికారులు కోచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విధుల్లో అలసత్వం నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్ ప్రేమలత ( అవుట్ సోర్సింగ్ ) ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలకు ఇబ్బంది కలిగిస్తున్న నర్సరీ నిర్వహణను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
క్రీడాకారులకు ట్రాక్ సూట్ లు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో
ఫెన్సింగ్ లో జాతీయ పతకం సాధించిన క్రీడాకారిని అక్షర శ్రీ ని అయన సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ,
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థులకు క్రీడలు అందజేయాలన్న లక్ష్యంతో నూతనంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారి సూచనల మేరకు అధికారులంతా పనిచేయాలని, విధుల్లో ఆ లక్ష్యం, అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు.
రాష్ట్రంలో క్రీడా పాఠశాలలకు దిక్సూచిగా ఉండాల్సిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని అందుకు తగినట్టుగా కోచులు అధికారులతో పాటు విద్యార్థినీ విద్యార్థులే కాక వారి తల్లిదండ్రులు కూడా నడుచుకోవాలని సూచించారు.
హకింపేట తో పాటు రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూళ్లను అకాడమీ లను ఆకస్మికంగా సందర్శించి లోటుపాట్లు ఎదురైతే సరిదిద్దుతామని సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి శ్రీమతి మమత , కోచ్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు




