
ఆర్టీవో కి తృటిలో తప్పిన ప్రమాదం…
ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న కేవీ కృష్ణారావుకు ఉప్పల్ రాజలక్ష్మి థియేటర్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేవీ కృష్ణారావును వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కామినేని ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల సమాచారం మేరకు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద ఘటన పై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




