
కేటీఆర్ ఖమ్మం పర్యటన తేదీ ఖరారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 7న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు జరిగే సన్మాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకుని, ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు.
ఈ కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అలాగే ఓడిపోయిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.



