Andhra PradeshPoliticalTelangana

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు!

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు!

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు!

Social media viral : వైకాపా నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం రోజున దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.

వివరాలు… ఈ ఏడాది ఫిబ్రవరిలో దువ్వాడ శ్రీనివాస్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రశ్నిస్తానని చెప్పుకున్న పవన్‌ కల్యాణ్‌… రూ.50 కోట్లు తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని అని ఆరోపించారు.

తనతో ఈ మాట ఓ టీడీపీ నాయకుడే అన్నాడని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారని… అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు సైలెంట్ అయిపోతుందని విమర్శించారు.

అలాగే పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన, కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

అయితే దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలకు సంబంధించి హిరమండలం జనసేన నాయకుడు వంజరాపు సింహాచలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దువ్వాడ శ్రీనివాస్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇందుకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు అందజేశారు.

ఇక, ఈ వ్యాఖ్యాలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్‌పై గతంలోనే వివిధ పోలీసు స్టేషన్‌లలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. జనసేన నాయకుడు అడపా మాణిక్యాల రావు గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… అక్కడ కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button