
కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జనవరి 2న శుక్రవారం ఉదయం బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గర ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మందిలో పలువురు విద్యార్థినీ, విద్యార్థులు గాయాలపాలయ్యారు. మణుగూరు నుంచి పాల్వంచ కాలేజ్ కి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం .ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని ఇతర వాహనాల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.




