
పురుగుల మందు కలిపిన అన్నం తినడంతో తల్లి, కూతురు మృ*తి
నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలకు గురువారం మధ్యాహ్నం విషం కలిపిన ఆహారం పెట్టిన తల్లి..తాను విషం కలిపిన ఆహారం తిన్నది.
కల్వకుర్తి పట్టణం తిలక్ నగర్ లో నివాసం ఉంటున్న ప్రసన్న (40), తన కుమార్తె మేఘన (13), కుమారుడు అశ్రిత్ కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
అనంతరం పురుగుల మందు కలిపిన అన్నం తినిపించి.. తాను తిన్నట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలో స తల్లి కూతుళ్లు మరణించగా..
కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కూతుళ్ళ మృతదేహాలను ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్న కుమారుడి కి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. 40 రోజుల క్రితం లావణ్య భర్త భీమ్ శెట్టి ప్రకాష్ మరణించాడు.
అతని మరణాన్ని జీర్ణించుకోలేని లావణ్య తాము బతికి ఉండడం కన్నా చావడమే మేలు అని భావించి ముగ్గురు తనువు చాలించాలి అనుకొని పురుగుల మందు కలుపుకొని అన్నం తిని ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయముపై కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




