
రూ.20 వేల లంచంతో దొరికిన SI
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఎస్ఐ రమేష్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎస్ఐ రమేష్‌కు సంబంధించిన ఆస్తులపైన విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు. 2025 అక్టోబర్ 17న పీడీఎస్ రైస్‌ను అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఘటనలో లారీ ఓనర్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నుంచి తప్పిస్తానని లారీ ఓనర్‌ను లంచం డిమాండ్ చేశాడు కొల్లూరు ఎస్ఐ రమేష్. దీంతో లారీ ఓనర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు లారీ ఓనర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ రమేష్ రూ.20 వేలు లంచం ఇస్తుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రమేష్‌కు సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు. ఎస్ఐ ఏకంగా స్టేషన్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



