KhammamPoliticalTelangana

ఘనంగా శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు

ఘనంగా శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు

ఘనంగా శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు

సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం

దళిత–బహుజన స్త్రీల జనోద్ధరణకు, మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయం నందు ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మరియు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ మాట్లాడుతూ,

“భారతదేశంలో మహిళలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి విప్లవ మహిళ సావిత్రిబాయి పూలే. దళిత–బహుజన స్త్రీలు చదవకూడదని, ప్రశ్నించకూడదని సమాజం ఆంక్షలు విధించిన కాలంలో, ఆ అవమానాలన్నింటినీ ధైర్యంగా తట్టుకుని బాలికలకు పాఠశాలలు ప్రారంభించిన మహానుభావురాలు ఆమె. నేటి మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వానికి పునాది వేసిన గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే.

ఆమె బోధించిన ‘విద్యే విముక్తి’ అనే సిద్ధాంతాన్ని తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు కె.సి.ఆర్ పాలనలో ఆచరణలోకి తీసుకువచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్.

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తూ, మహిళల గౌరవం, హక్కులు, విద్య కోసం నిరంతరం పోరాడటం మా బాధ్యత. ఆమె జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆమె ఆదర్శాలను తమ జీవితాల్లో ఆచరించాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్, కార్పొరేటర్లు తోట గోవిందమ్మ రామారావు, శీలంశెట్టి రామ వీరభద్రం, బుడిగం శ్రీనివాస్, నాగండ్ల కోటి, బుర్రి వెంకట్, కూరాకుల వలరాజు, పల్లా రోస్ లీనా, డాదే అమృత, బిక్కసాని ప్రశాంతి జస్వంత్, జ్యోతి రెడ్డి, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, ధోన్ వాన్ సరస్వతి రవి, గోళ్ళ చంద్రకళ వెంకట్, తోట ఉమారాణి వీరభద్రం, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత సహాయకులు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button