
వైద్య ఆరోగ్యశాఖ జూనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో సస్పెన్షన్
………
ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిసచేస్తున్న కె. రవితేజ ను అడ్మినిస్ట్రేటివ్ కారణాలపై శనివారం సస్పెండ్ చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వుల ద్వారా తెలియజేయనైనది.
తిరుమలాయపాలెం ఏరియా హాస్పిటల్‌లో జూనియర్ అసిస్టెంట్ గా డిప్యుటేషన్‌లో వున్నప్పుడు అక్కడి కార్యాలయంలో అభ్యంతరకర ప్రవర్తనతో సిబ్బందికి భయం మరియు అసౌకర్యాన్ని కలిగించిన కారణానా కలేక్టర్ గారి దృష్టికి ఆరోపణలు వెళ్లిన దృష్ట్యా వైద్యశాఖ అధికారులు విచారణలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 యొక్క నియమం (3) ప్రకారం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ కారణాలపై సస్పెన్షన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. డి. రామారావు ఉత్తర్వుల జారీ చేశారు .



