
బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సిట్ నోటీసులు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది.
ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
నవీన్ రావు ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ, కొందరు బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రైవేట్ వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఎవరితో, ఏ డివైజ్ తో ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న విషయాలపై నవీన్ రావును సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది.
నవీన్ రావు విచారణ తర్వాత.. బీఆర్ఎస్ కీలక నేతలను కూడా సిట్ విచారించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలతో పాటు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.



