
7.4 కేజీల గంజాయి పట్టివేత..
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జనవరి 05,
ఒరిస్సా నుంచి పాల్వంచకు బైక్‌పై తీసుక వస్తున్న 7.4 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సోమవారం పట్టుకున్నారు.
పాల్వంచ పట్టణ శివారు కేశవాపురం పంచాయతీ కార్యాలయం ఎదురుగా రోడ్డు పై ఎన్‌ఫోర్ప్‌మెంట్ టీమ్ ఎస్సై శ్రీహరి రావు సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
నిందితుల నుంచి 7.4 కేజీల గంజాయి తో పాటు బైక్ ను మూడు సెల్ ఫోన్లను ముగ్గురు వ్యక్తులను పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ కేసులో గొల్లపల్లి చిరాకుపల్లి కి చెందిన సాంబశివ రావు, భూక్య శ్రీహరి, పోతుల చిన్న లను అరెస్టు చేసి స్టేషన్‌లో అప్పగించారు.
గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్ రావు, అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్, ఏఈఎస్ తిరుపతి అభినందించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 3.50 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.


