
ఓం నారాయణ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద LHPS నిరసన
ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్…..
ఈరోజు జరగబోయే దీక్షకు ముఖ్య అతిథిగా డాక్టర్ వివేక్ గారు హాజరు కాగా,పోలీసుల అనుమతి నిరాకరణ తో కలెక్టర్ ఆపీసు ఎదుట నిరసన
ప్రభుత్వ జీతం తోసుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలకడం ఏంటి….?
అతి త్వరలో హై కర్ట్ ద్వారా ఆర్డర్ తీసుకొస్తామని స్పష్టం చేశారు….*
మహబూబాబాద్/జిల్లా కేంద్రం 06/01/2026:
ఓం నారాయణ ఆక్రమించుకున్న 107 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ లంబాడీ హక్కుల పోరాట సంఘం (LHPS) నాయకులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ముందుగా నిర్ణయించిన వ్యవసాయ మార్కెట్ ఎదుట దీక్షకు సిద్ధమవ్వగా, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నాయకులు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి, అనంతరం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా, వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని LHPS నేతలు ఆవేదన వ్యక్తం చేశారు,ప్రభుత్వ భూములను కాపాడాల్సిన యంత్రాంగం, కబ్జాదారులకు అండగా నిలబడటం సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని వారు ప్రశ్నించారు, ఆక్రమణదారుడు ఓం నారాయణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకే అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడం లేదా? అని వారు నిలదీశారు,ప్రభుత్వం స్పందించి ఆ భూమిని స్వాధీనం చేసుకునే వరకు తమ పోరాటం ఆగే ప్రసక్తి లేదని నేతలు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బాలు నాయక్,లావుడియా సీతారాం నాయక్,చంద్రు నాయక్,శాంతి కుమార్, సాయి కుమార్,సూర్య ప్రకాశ్,శివ వర్మ,అజయ్,సంతోష్,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




