
నా భర్త నుంచి ప్రాణహాని ఉంది.. బాధితురాలు ఆవేదన
తన భర్త మదనం రాములు నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితురాలు మధులత కోరారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆమె మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తమకు ఇద్దరు పిల్లలుఉన్నారని, భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకుని వేధిస్తున్నారని వాపోయారు.
ఉపాధ్యాయ వృత్తికి తను మాయని మచ్చ అని.. కట్టుకున్న భార్యను కాదని పాఠాలు బోధించిన విద్యార్థినితో ప్రేమ వ్యవహారం సాగించి, ఆపై ఆమెను పెళ్లి చేసుకున్న భర్త మదనం రాములు వ్యవహారంపై భార్య మదనం మధులత తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది.
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జక్రాన్ పల్లి మండలం సికింద్రాబాద్ గ్రామంలో 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసే సమయంలో శిష్యురాలు చాట్ల సంధ్యతో పరిచయం ఏర్పడిందన్నారు.
శిష్యురాలు సంధ్యను తానే ఇంటర్, డిగ్రీ ఉన్నత చదువులు చదివించాడని చెప్పింది. ప్రస్తుతం తన భర్త మదనం రాములు ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నట్లు చెప్పింది.
గత ఐదు సంవత్సరాల నుంచి తనను పెళ్లి చేసు కుంటానని, ఇంటికి తీసుకురావాలంటూ వేధిస్తూ శారీరకంగా మానసికంగా చిత్రహింసల గురి చేశాడని తెలిపింది.
న్యాయం చేయాలంటూ.. ఇదే విషయమై గత ఏడాది నవంబర్ 6న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు స్పందించి కౌన్సిలింగ్ నిర్వహించిన ఎలాంటి మార్పు జరగక పోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపింది.
గడిచిన ఆదివారం ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు, ఇంటి డాక్యుమెంట్లు ఏవి వదలకుండా తీసుకెళ్లి విద్యార్థిని సంధ్యతో తన భర్త మదనం రాములు ఇంటి నుంచి పరారయ్యాడని తన బాధను చెప్పుకుంది.
తన భర్తతో నాతో విడాకులు కాకుండానే చాట్ల సంధ్య తల్లిదండ్రులు అమ్మాయిని నా భర్తతో పరారు అయ్యేందుకు సహకరించారని చెప్పింది. ఒక ఉపాధ్యాయురాలిగా వృత్తిలో ఉన్న నాకు రక్షణ లేదని, చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది.
నా భర్త నా వద్దకు వచ్చేలా న్యాయం చేయాలని, పిల్లల బాధ్యత నా భర్త వహించాలని, ఆస్తి పంపకాలు ఇద్దరు పేరుమీద ఉండాలని, అమ్మాయితో అక్రమ సంబంధం వదిలేసి వస్తే భర్తతోనే ఉండేందుకు సిద్ధమని వెల్లడించింది. తనకు న్యాయం చేసేందుకు ప్రజా సంఘాలు, మహిళా సంఘాల తనకు మద్దతుగా ఉండాలని మదనం మధులత కోరింది.



