HyderabadPoliticalTelangana

పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత! ఆమోదించిన మండలి చైర్మన్

పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత! ఆమోదించిన మండలి చైర్మన్

పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత! ఆమోదించిన మండలి చైర్మన్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి నాలుగు నెలలు గడిచింది. ఎట్టకేలకు ఆమె రాజీనామాను ఆమోదించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

అసెంబ్లీ సమావేశాలు నిరవదిక వాయిదా పడిన కొద్ది కాసేపట్లోనే కవిత రాజీనామాకు ఆమోదం తెలుపుతున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు లెజిస్లేటివ్ సెక్రటరీ. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్ధానం నుంచి శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు.

బీఆర్ ఎస్ పార్టీతో అంతర్గత విభేదాల కారణంగా గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గడచిన సోమవారం శాసనమండలికి చివరిసారిగా హాజరై, తన రాజీనామాను ఆమోదించాలంటూ శాసన మండలి చైర్మన్ ను విజ్ఞప్తి చేశారు.

తొందరపడకండి.. మరోసారి ఆలోచించండన్నా.. పంతం వీడని కవిత..

చివరిసారి తాజాగా తెలంగాణ శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించిన కల్వకుంట్ల కవిత , తన రాజీనామా విషయంపై స్వయంగా చైర్మన్ కోరినా వినలేదు.

తొందరపడకండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు, మీరు బాధలో ఉన్నారు. మరోసారి రాజీనామాపై పునరాలోచించండి అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితకు చివరిసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు.

తాను రాజకీయాల్లోకి అమెరికా నుంచి ఎందుకు వచ్చాను, తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి ఏర్పాటు చేయడంతోపాటు, ఉద్యమానికి , బీఆర్ ఎస్ పార్టీకి జాగృతి చేసిన కృషి గురించి మండలిలో చివరి ప్రసంగంలో మాట్లాడారు కవిత.

తన తండ్రి స్థాపించిన బీఆర్ ఎస్ పార్టీలో తాను మొదటి నుంచి ఎదుర్కొంటున్న అవమానాలను ప్రస్తావిస్తూనే, బీఆర్ ఎస్ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందంటూ మండలిలో సంచలన ఆరోపణలు చేశారు.

కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లేకుండా ఇన్నాళ్లు తాను ఎదుర్కొన్న సవాళ్లను సభలో ప్రస్తావిస్తూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు కవిత. ఉబికి వస్తున్న కన్నీళ్లతో తన ప్రసంగం ఆద్యంతం కొనసాగింది.

ఇంతలా అవమానాలు ఎదుర్కొన్న తాను ఇక బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగలేనని, తన రాజీనామా వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ను కోరారు కవిత.

కవిత మాటకు స్పందించిన చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారించే ప్రయత్నం చేసినా కవిత వినలేదు. ఇప్పటికే నాలుగు నెలలు రాజీనామా ఆమోదం కోసం ఎదురు చూశానని, అన్ని విషయాలు ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, వెనక్కు తగ్గబోనని స్పష్టం చేశారు.

కవిత రాజీనామా విషయంలో నిర్ణయం మార్చుకోవడం కష్టమని భావించిన శాసన మండలి చైర్మన్ తాజాగా ఆమె రాజీనామాకు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కవిత పంతం నెగ్గించుకున్నట్లైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button