
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని రామ్‌నగర్‌లో ఇంట్లోని బాత్రూంలో నాగమణి(35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
విరాలలోకి వెళితే..కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెడ్డపాక జగదీష్‌కు నాగమణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరు పట్టణంలోని రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. జగదీష్ ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
వీరికి సంవత్సరన్నర వయసు కలిగిన కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లిన నాగమణి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త డోర్ పగులగొట్టి చూడగా,షవర్‌కు చున్నీతో నాగమణి ఉరి వేసుకోని ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కాగా మృతుని తల్లిదండ్రులు మాత్రం నాగమణిని భర్త జగదీష్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు.ఇట్టి విషయంపై కేసు నమోదు చేసుకుని దర్మాప్తు చేస్తున్నట్లు ఒకటవ పట్టణ సిఐ తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.



