
ఖబర్థర్ కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకో..
ఖమ్మం పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నిన్న ఖమ్మం జిల్లా పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు..
నువ్వు ఎక్కడో ఎసి రుములలో కుర్చుని,తప్పుడు మాటలు విని ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఖమ్మం జిల్లా ప్రజలు సహించారు..ఎవరు అవినీతి పరులో ప్రజలందరికీ తెలుసాన్నారు..
అధికారం పోయి కోర్టులు చుట్టూ తీరుగుతు,విచారణ ఎదుర్కొంటున్నారో ప్రజలందరికీ తెలుసు అని, సీతారామ ప్రాజెక్టు పై మేము చర్చకు సిద్ధమన్నారు..10 వేల కోట్ల ఖర్చు పెట్టి 10 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదని విమర్శించారు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తరువాత రాజీవ్ లింక్ కెనల్ ని 100 కోట్లుతో ఏర్పాటు చేసి ఈరోజు వైరా రిజర్వాయర్ కు,అదేవిధంగా సత్తుపల్లి,మధిర నియోజకవర్గలకు నీళ్ళు ఇస్తున్నామన్నారు..ఇంత వరకు పర్యావరణ అనుమతులుగాని,అటవీ శాఖ భూముల కాలేదు,ఎక్కడ 90శాతం పూర్తైందో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు..
గ్రామాల అభివృద్ధిలో ముగ్గురు మంత్రులు పోటీ పడి అన్ని రకాలుగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తున్న విషయం మర్చిపోయి,కమీషన్ల కోసం చేస్తున్నారని చెప్పాడం విడ్డురంగా ఉందన్నారు..
మంత్రి వర్గంలో 40 సంవత్సరాల రాజకీయం లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పై స్థాయి, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని విమర్శించారు..నీకు ఉన్న వయస్సు లో ఆయన్ను అనే స్థాయి నీకు లేదన్నారు..
అదేవిధంగా భట్టి విక్రమార్క గారు చేసే అభివృద్ధి ఏంటో ఒక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో పోతే తెలుస్తుందన్నారు..పువ్వాడ అజయ్ ఇంట్లోనో,వద్దిరాజు రవిచంద్ర ఇంట్లోనో కుర్చుని మాటలు చేప్పాడం కాదన్నారు..
భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పోంగులేటి శ్రీనివాసరెడ్డి 30 శాతం కమిషన్లు తీసుకుని అభివృద్ధి చేస్తున్నారనేది తీవ్రంగా ఖండించారు,బహిరంగా చర్చకు రావాలని డిమాండు చేశారు..జిల్లాలోని ముగ్గురు మంత్రులపై విమర్శించే తీరు చూస్తే కేటీఆర్ లో అసహనం పరాకాష్టకు చేరిందని అన్నారు,
కేటీఆర్ భాష మంచిది కాదని హితవు పలికారు..పాఠశాలలు,వైద్యశాలాలు,అదేవిధంగా నీటి సౌకర్యం,అదేవిధంగా రైతుల పంట సేకరణ,500 రూపాయలు బోనస్,అన్ని విషయాల కూడా మా ప్రభుత్వం అమలు చేస్తున్నాయని తెలిపారు..
గత పది సంవత్సరాల చేసిన పనుల కంటే ఈ రెండు సంవత్సరాలలో చేసినవి విచారణకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు..గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధిని,సంక్షేమాన్ని చూపిస్తం మీరు రాండి,లేకపోతే మీ మనుఘలను పంపించండి అని సవాలు చేసారు..




