
యువతి సూసైడ్‌కు కారణమైన యువకుడి అరెస్ట్..
యువతి సూసైడ్‌కు కారణమైన యువకుడి అరెస్ట్.. ఓ వైపు నుంచి ప్రేమ పెళ్లి చేసుకుందామంటూనే.. మరో వైపు వేరే వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతున్నావంటూ వేధిస్తూ యువతి మృతికి కారణమైన యువకుడిని బుధవారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సీఐ మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. నాగోల్ పరిధి తట్టి అన్నారంలోని తెలంగాణ కోఆపరేటివ్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఐశ్వర్య(19) వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురం.. గాయత్రినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ సభావత్ మహేశ్ అలియాస్ ఆనంద్ (23) ఇద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇటీవల మహేశ్, ఐశ్వర్యతో ‘మీ పెద్దలను ఒప్పించు.. పెళ్లి చేసుకుందాం’ అని చెప్పడంతో ఆమె తన తల్లిదండ్రులను ప్రేమపెళ్లికి ఒప్పించింది. కానీ గత కొన్ని రోజులుగా మహేశ్.. ఐశ్వర్య వ్యక్తిత్వంపై అనుమానం వ్యక్తం చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడు.
గత సోమవారం రోజు మహేశ్,.. ఐశ్వర్యను కలిసి ‘నువ్వు ఎవరితోనో తరుచుగా ఫోన్లో మాట్లాడుతున్నావు’ అంటూ మరోసారి క్యారెక్టర్‌పై కామెంట్స్ చేశాడు.
తీవ్ర మనస్థాపం చెందిన ఐశ్వర్య వెంటనే పక్కనే ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకింది. బలమైన గాయాలు కావడంతో ఆమెను వెంటనే నాగోల్‌లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మహేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.



