
విద్యార్థినితో ప్రేమవ్యవహారం.. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు
Web desc : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని యోగేశ్వర్ కాలనీలో నివసించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థిని తో ప్రేమ వ్యవహారాలు నడిపి పెళ్లి చేసుకున్న మధనం రాములు పై భార్య మధులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్మూర్ పట్టణానికి చెందిన మదనం రాములు మధులతలకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వివాహం తర్వాత వీరి జీవితం అన్యోన్యంగా సాగింది. ఈమధ్య జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన సంధ్యా అనే యువతితో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెళ్లి చేసుకున్నాడు.
రెండో వివాహం తర్వాత తనను మానసికంగా, శారీరకంగా హింసించి తీవ్రంగా కొట్టాడని ఆర్మూర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్య మధులత సీఐ సత్యనారాయణ గౌడ్ కు ఫిర్యాదు చేసింది.
మధులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రాములును పోలీస్ స్టేషన్ లో సీఐ కౌన్సిలింగ్ నిర్వహించి నచ్చజెప్పిన ఫలితం లేకుండా పోయింది. చివరికి పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాములు పై కేసు నమోదు చేశారు.



