
మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం!
తీవ్ర విషాదం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి (86) కన్నుమూత.. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ఆమె సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో శివలక్ష్మి గారు తుదిశ్వాస విడిచారు.
కొంతకాలంగా వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని అమీర్ పేటలో ఉన్న తమ నివాసంలో నేడు తుది శ్వాస విడిచారు.ఈ విషాద వార్త కొణిజేటి రోశయ్య కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది.
మాజీ సీఎం రోశయ్య రాజకీయ ఎదుగుదలకు ఆమెనే కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న రోశయ్య రాజకీయ ప్రస్థానంలో ఆయన సతీమణి శివలక్ష్మి పాత్ర చాలా కీలకమైనది.
రోశయ్యకు అండదండగా నిలిచి, ఆయనకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చి ప్రజాసేవలో ముందుకు వెళ్లేలా చేసిన ఘనత ఆమెది.
కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా, కుటుంబ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చి చూసుకున్నారు. రోశయ్య అత్యున్నత పదవులను అలంకరించిన కూడా నిరాడంబరంగా జీవించారు.
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా పని చేస్తున్న రోశయ్య సతీమణి ఏ రోజు తను సీఎం భార్యను అన్న అహంకారాన్ని చూపించలేదు.
2021లో రోశయ్య మరణానంతరం ఆమె తన కుమారులతో కలిసి అమీర్ పేట లో నివసిస్తున్నారు. శివలక్ష్మి మృతి చెందారన్న వార్త తెలియగానే అనేక రాజకీయ నేతలు వారి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
అన్ని పార్టీల నేతలు సంతాపం పార్టీలకు అతీతంగా కొణిజేటి రోశయ్య అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉన్న కారణంగా కాంగ్రెస్,బీఆర్ఎస్, టిడిపి, బిజెపి వంటి పార్టీల నుండి సీనియర్ నేతలు ఆమెకు సంతాపం తెలిపారు. సౌమ్యురాలిగా, ఆదర్శ గృహిణిగా ఆమె కుటుంబాన్ని తీర్చిదిద్దారని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు.
తెలుగు రాష్ట్రాల సీఎం ల సంతాపం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దివంగత రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రోశయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. అయినప్పటికీ వారిలో ఎవరూ రాజకీయాలలోకి రాలేదు.
ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శివలక్ష్మి అంత్యక్రియలు జరపడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.



