
లక్ష్మీ బృందావన్ కాలనీలో.. భోగి వేడుకలు
ఖమ్మంరూరల్: చేదు జ్ఞాపకాల చీకట్లను చీల్చాలని ఆకాంక్షిస్తూ.. సరికొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ బృందావన్ కాలనీ స్ట్రీట్ నెంబర్ -1 లో కాలనీవాసులు బుధవారం భోగి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కోపం, ద్వేషం, కపటం వంటి మాలిన్యాలు ఆహుతి కావాలని ఆశిస్తూ.. అందరూ కలిసి భోగి మంటలు వేశారు. గొబ్బెమ్మ ముగ్గుల ముంగిళ్ళు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో అంతటా కొత్త కళను నింపే సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు.




