
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
హైదరాబాద్: నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి 84వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి హాజరై.. ఘన నివాళులర్పించారు.
ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్ర కీలకమైందని, రాజకీయాల్లో 40 ఏళ్లపాటు అజాతశత్రువుగా నిలిచారని, సమాచార హక్కు చట్టం రావడంలో ఆయన కృషి ఎనలేనిదని గుర్తు చేసుకున్నారు.




