
ఖమ్మం నగరం 30వ డివిజన్‌లో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
ఖమ్మం నగరం 30వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ముక్కాల కమల ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా జరిగాయి.
ఈ పోటీల్లో సుమారు 560 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేయగా, ప్రత్యేకంగా 20 ప్రత్యేక బహుమతులు ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా వాషింగ్ మిషన్, దివాన్ కాట్, డ్రెస్సింగ్ టేబుల్ వంటి విలువైన బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ, ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరీమణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం కార్పొరేటర్ కమల తనయుడు ముక్కాల రాజేష్ ని ప్రశంసిస్తూ, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే చురుకైన నాయకుడిగా, ప్రతి పండగను ప్రజలతో కలిసి జరుపుకునే వ్యక్తిగా ఆయనను అభినందించారు.
బతుకమ్మ ఉత్సవాలు, వినాయక ఉత్సవాలు, దేవి నవరాత్రులు, సంక్రాంతి ఉత్సవాలు వంటి ప్రతి కార్యక్రమంలో ప్రజలతో మమేకమై, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటూ డివిజన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న నాయకుడని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకే పార్టీలో నిలబడి, నమ్మిన పార్టీని, పట్టుకున్న జెండాను వదలని నికార్సయిన BRS కార్యకర్త ముక్కాల రాజేష్ కి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు, మద్దతు ఉండాలని కోరారు.
చివరగా ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన మహిళా సోదరీమణులకు, డివిజన్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముక్కాల రాజేష్, బి రెడ్డి ప్రకాష్ నాగేంద్రబాబు చింతల సత్యవతి బండి నవీన్ ,కట్ల రవి ,భాస్కర్ ,వీరు త్రిష ,భవ్య రాధ ,నాగరాజు,వెంకటేష్ శ్రీకాంత్ ,భారతి ,నాగరాజు ,వెంకటేష్ శ్రీకాంత్ ,భారతి ,వేణు,నరసరావు గోపాల్ ,విష్ణు ,అరవింద్ ,నందు లింగరాజు ,చింతల ఉపేందర్,నవీన్ నరేష్ వర్మ ,వినోద్ ,మధు ,సతీష్ నరేష్ ,సూరి,డివిజన్ ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




