
హోమ్ మేడ్ పికిల్స్ పేరుతో ఘరానా మోసం..!
Web desc : జగిత్యాల పట్టణంలో హోమ్ మేడ్ పికిల్స్ అని చెప్పి కస్టమర్లను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
పట్టణానికి చెందిన నవీన్ శుక్రవారం కొత్త బస్టాండ్ సమీపంలోని రాజు స్వీట్స్‌కు వెళ్లి, ఇంట్లో తయారు చేసిన టమాటో పచ్చడి అని నమ్మి మార్కెట్ ఒక కిలో పచ్చడి రూ.400కు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాక్స్ ఓపెన్ చేసిన నవీన్‌కు షాక్ తగిలింది.
హోమ్ మేడ్ అని చెప్పిన పికిల్ బాటిల్ లోపల ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సీల్ మార్క్ స్పష్టంగా కనిపించడంతో అసలు విషయం బయటపడింది. బయట స్టిక్కర్‌ను తొలగించినప్పటికీ, లోపల ఉన్న కంపెనీ సీల్‌ను తీసేయడం మర్చిపోవడంతో మోసం బట్టబయలైంది.
మార్కెట్ లో రూ. 150 కి లభించే పికిల్ బాటిల్ ను స్టిక్కర్ తొలగించి హోమ్ మేడ్ పికిల్ అని ఏకంగా కిలో రూ.400 చొప్పున అమ్మడం పై బాధితుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసాడు.
హోమ్ మేడ్ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి కస్టమర్లను మభ్యపెడుతున్న షాప్ యజమానిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.



