PoliticalSPORTSTelangana

సీఎం కప్ పోటీలకు సాంకేతిక హంగులు

సీఎం కప్ పోటీలకు సాంకేతిక హంగులు

సీఎం కప్ పోటీలకు సాంకేతిక హంగులు

తెలంగాణ ప్రభుత్వం క్రీడా శాఖ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న రెండో విడత సీఎం కప్2025-26 ను సాంకేతిక సహకారంతో క్రీడాకారులకు సమగ్ర సమాచారం ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గత సంవత్సరం నిర్వహించిన సీఎం కప్ – 2024గ్రామీణ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు
దాదాపు మూడు లక్షల విద్యార్థిని విద్యార్థి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
అదే స్ఫూర్తిని కొనసాగించడానికి రెండవ విడత సీఎం కప్ 2025-26 ని నిర్వహించాలని తెలంగాణ క్రీడా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సెకండ్ ఎడిషన్ సీఎంకప్ 2025 – సాంకేతికత ఆధారిత ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ

సీఎంకప్‌ 2025 లో పాల్గొనే క్రీడాకారులకుసాంకేతికత
సహాయ, సహకారం ద్వారా
సరళమైన, , సమాచారము సంక్షిప్తం చేయడం దీని ముఖ్య ఉద్దేశం

సహాయం
ఏఐ చాట్‌బాట్ (24×7)
ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు ఎప్పుడైనా ఏఐ చాట్‌బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. ఇది తక్షణ మార్గదర్శనం అందించి, సంబంధిత విభాగానికి ఫిర్యాదులను స్వయంచాలకంగా పంపిస్తుంది.

సహకారం
వాట్సాప్ బాట్

వాట్సాప్ ద్వారా సులభంగా ఫిర్యాదులు నమోదు చేసి, వాటి స్థితిని ట్రాక్ చేయవచ్చు. మీ నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు రియల్ టైమ్ అప్‌డేట్లు
పంపించడం జరుగుతుంది.

సమాచారం

ఏఐ కాల్ సెంటర్ (ఇన్‌బౌండ్ & అవుట్‌బౌండ్)

ఫిర్యాదు నమోదు, ఫాలో-అప్‌లు, పరిష్కార సమాచారం కోసం కాల్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదు స్థితి మరియు ముగింపు వివరాలను ఆటోమేటెడ్ కాల్స్
ద్వారా తెలియజేస్తుంది.

సమన్వయము

కేంద్రీకృత ఫిర్యాదు ట్రాకింగ్ వ్యవస్థ

అన్ని ఫిర్యాదులు ఒకే వేదికపై నమోదు చేయబడి, నిర్ణీత కాల పరిమితులలో పర్యవేక్షించబడి, పారదర్శకంగా పరిష్కరించబడతాయి — దీని ద్వారా బాధ్యత మరియు వేగవంతమైన పరిష్కారం సాధ్యం అవుతుందని అధికారులు తెలిపారు.

ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం సహకారంతో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సీఎం కప్ పోటీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి సమాచారం నిక్షిప్తం చేసి భవిష్యత్తులో జరిగే క్రీడా పోటీల సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందజేయడానికి క్రీడా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button