
విద్యుత్ షాక్ తో రైతు మృతి
జనవరి 20 (సి కే న్యూస్) చేగుంట /
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన, చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన మ్యాకల కిష్టయ్య (55) తన వ్యవసాయం పొలం వద్ద విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా చేతికి వైర్ తగలడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు, విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.



