
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. KTRను ప్రశ్నించనున్న ఆ ఇద్దరు అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఇచ్చిన నోటీసుల మేరకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
ఆయన వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావుతో, పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా కాసేపట్లో ఆయనను జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నించనున్నారు. కేటీఆర్ విచారణ కోసం ఇప్పటికే సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నలను సిద్ధం చేశారు.
తాజాగా, హరీశ్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కొన్ని ప్రశ్నలను సంధించి కేటీఆర్‌ను క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.



