
కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా
నిజామాబాద్ నగర శివారులో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో గంజాయిస్ ముఠా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యకు అతి దారుణంగా కారుతో ఢీ కొట్టిన సంఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.
శుక్రవారం సాయంత్రం సుమారు 6:45 గంటల సమయంలో, నిజామాబాద్ పట్టణానికి ఎండుగంజాయి (డ్రై గంజా) తరలింపు జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంపై ఆధారపడి, నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీఐ ) ఆమె సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలోని మాధవనగర్ ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించారు.
ఆపరేషన్ సమయంలో ఒక కారును తనిఖీ కోసం ఆ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేయగ ఆ వాహనం ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యను ఢీకొట్టింది.
దీంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
సంఘటన సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం, కానిస్టేబుల్ జి. సౌమ్యకు అంతర్గత పొట్ట గాయాలు అయినట్లు నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించబడింది.
సంఘటనకు సంబంధించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదనంగా, వాహనం నుంచి సుమారు 2 కిలోగ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.



