
ఒకే చీరతో ఉరేసుకుని ప్రేమజంట ఆత్మ*హత్య…
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. గ్రామస్తుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
బొమ్మనపల్లి గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్ అనే యువకుడు పదరా మండలం చిట్లం గుంట గ్రామానికి చెందిన సువర్ణ వారిరువురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కొంతకాలంగా ప్రేమలో పడ్డారు.
వారు ఇరువురు ఇష్టపడి వివాహం చేసుకుందామని అనుకున్నారనీ.. ఇటీవల అమ్మాయి అబ్బాయి ఇంటికి రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు మందలించారని తెలిపారు. ఈ క్రమంలో ఇరువురు మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది.
అయితే మంగళవారం అమ్మాయి తమ స్వగ్రామం నుండి అబ్బాయి గ్రామానికి చేరుకున్నారని.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అని క్షణికావేశానికి గురైనట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో తల్లిదండ్రుల అభ్యంతరాలు ఉండడం వలన మనస్థాపానికి గురైన వారు ఇంట్లోనే ఉన్నారని తెలిసింది. వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకుందో తెలియదు కానీ రాత్రి ఒకే చీరతో ఇద్దరూ హ్యాంగింగ్ చేసుకొని మృతి చెందారని తెలిపారు.
ఆ విషయం బుధవారం ఉదయం సోదరుడు అనుమానం వచ్చి ఇంటిని తట్టగా.. ఇలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో బలవంతంగా తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా వారిద్దరూ విగత జీవులుగా కనిపించడంతో విషయం గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సీఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని మృతులను అచ్చంపేట ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువుల నుంచి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని డీఎస్పీ ‘దిశ’కు తెలిపారు.



