
జనసేన ఎమ్మెల్యే వేధింపులు..రంగంలోకి ఏపీ మహిళా కమిషన్
Web desc : జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏపీ మహిళా కమిషన్ రాయపాటి శైలజ.. వెంటనే స్పందించారు.
బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు రాయపాటి శైలజ. లైంగిక వేదింపుల పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల బాగోతాన్ని వైసీపీ బయట పెట్టింది.
ఓ ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి, సంవత్సరం నుంచి అత్యాచారం చేశాడంటూ వైసీపీ ఆరోపణలు చేసింది. కోరిక తీర్చకుంటే మూడేళ్ల కొడుకును చంపేస్తానని కూడా సదరు ఎమ్మెల్యే బెదిరించాడట.
భర్తకు విడాకులు ఇవ్వాలని ఆ బాధితురాలిని ఎమ్మెల్యే బెదిరించినట్లు కూడా వైసీపీ పేర్కొంది. కూటమికి చెందిన ఎమ్మెల్యే శ్రీధర్ వల్ల మహిళ గర్భవతి అయిందని కూడా వెల్లడించింది.
దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూటమి బడా నాయకులు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, హోం మంత్రి అనితలను వైసీపీ డిమాండ్ చేసింది.



