
నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏకంగా 859 పోస్టులకు నోటిఫికేషన్..
ఇటీవల కాలంలో చాలా మంది యువతీ, యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు.
ఇతర జాబ్ లకన్నా.. సర్కారు కొలువులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ లు ఉన్నవారికే సమాజంలో మంచి రెస్పాక్ట్ తో పాటు పెళ్లిళ్లు కూడా అవుతున్నాయి.
చాలా మంది అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్ లు ఉన్న కుర్రాళ్లను మాత్రమే పెళ్లి చేసుకుంటామని తెల్చిచెప్తున్నారు. దీంతో ఎంత కష్టమైన చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.
కొంత మంది గ్రూప్ ఎగ్జామ్ లు, టీచర్, పోలీసు, మెడికల్, ఇలా వివిధ శాఖల్లో జాబ్ ల భర్తీకై ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి తెలంగాణహైకోర్టు భారీ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి టీజీహెచ్‌సీ (TGHC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ క్రమంలో దీనికి 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని కోర్టు వారు తెలిపారు.
పోస్టు పేరు – ఖాళీలు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 35
- జూనియర్ అసిస్టెంట్: 159
- టైపిస్ట్: 42
- ఫీల్డ్ అసిస్టెంట్: 61
- ఎగ్జామినర్: 49
- కాపిస్ట్: 63
- రికార్డ్ అసిస్టెంట్: 36
- ప్రాసెస్ సర్వర్: 95
- ఆఫీస్ సబార్డినేట్: 319
మొత్తం ఖాళీల సంఖ్య – 859
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 46 ఏళ్లుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
జీతం: నెలకు స్టెనోగ్రాఫర్‌కు రూ.32,810 – రూ.96,890, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.24,280 – రూ.72,850, ఎగ్జామినర్, కాపిస్ట్, ప్రాసెస్ సర్వర్‌కు రూ.22,900 – రూ.69,150, రికార్డ్ అసిస్టెంట్‌కు రూ. 22,240 – రూ.67,300, ఆఫీస్ సబార్డినేట్‌కు రూ.19,000 – రూ.58,850.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ లో చేసుకొవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400 గా నిర్ణయించారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 2026 జనవరి 24 కాగా, ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 2026 ఫిబ్రవరి 13గా నిర్ణయించారు. రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుదని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ చూడాలని నోటీఫికేషన్ లో పేర్కొన్నారు.



