
మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. ఘటన సమయంలో స్పాట్‌లో 25 మంది ఉన్నారు.
వారిలో ఇద్దరు ఘటన ప్రాంతంలో మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
భూపాలపల్లి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాముత్తారం మండలం కాటారం-మేడారం ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఘటన సమయంలో 25 మంది ఉన్నారు.
ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందినవారు.
మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌లో 25 మంది కలిసి మేడారం జాతరకు మంగళవారం సాయంత్రం బయలు దేరారు.
పెగడపల్లి-కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ట్రాక్టరు రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపు తప్పింది. కిందకు పల్టీ కొట్టి బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీ కింద తల్లీ కూతుళ్లు ఉండిపోయారు. వారిద్దరు స్పాట్‌లో మృతి చెందారు.
మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా :
మరో మహిళ ట్రాక్టర్ లోపల ఇరుక్కుపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు ట్రాలీ కింద ఇరుక్కుపోయిన ఆ మహిళను స్థానికుల సాయంతో బయటకు తీశారు.
ఘటన ప్రాంతం నుంచి భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనాస్థలికి ఏఎస్పీ చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంతో మేడారానికి వెళ్లేదారిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కాటారం మీదుగా వచ్చే వాహనాలను భూపాలపల్లి-కమలాపూర్ క్రాస్ నుంచి మళ్లించారు. మృతులు ఇద్దరు ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందినవారు.
తల్లి లక్ష్మి వయస్సు 45 ఏళ్లు ఉండగా, ఆమె కూతురు కస్తూరి అక్షిత వయస్సు 21 ఏళ్లు. గాయపడిన బాధితులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.



