
డిప్యూటీ CM అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది.
బారామతిలో ల్యాండింగ్ వుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది.ఈ ఘటనలో అజిత్ పవార్‌తో సహా ఆరుగురు మరణించినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.
బుధవారం ఉదయం తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లెట్ ప్రమాదానికి గురైంది.
కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సిబ్బంది సహా ఆరుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు.. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అజిత్‌పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహటిన బారామతి బయల్దేరారు.
అజిత్ పవార్ (Ajit Pawar) మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు.
ఎన్సీపీ తరఫున ఎమ్మెల్యేగా, మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహాయుతి కూటమిలో ఎన్సీపీ వర్గం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు.



