HealthHyderabadPoliticalTelangana

స్పృహలోకి వచ్చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

స్పృహలోకి వచ్చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

స్పృహలోకి వచ్చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

హెల్త్ బులిటెన్ విడుదల చేసిన నిమ్స్ వైద్యులు

నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య ఆరోగ్య పరిస్థితిలో స్వల్ప పురోగతి కనిపించింది. హాస్పిటల్ లో చేరినప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆమె కండిషన్ కాస్త మెరుగుపడిందని,

ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉందని నిమ్స్ డాక్టర్లు మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. డాక్టర్లు చెప్పే మాటలను ఆమె వింటోందని, కమాండ్స్ ను ఒబే చేస్తోందని పేర్కొన్నారు.

ఈ నెల 25న నిమ్స్ ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చినప్పుడు సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. అప్పుడు పల్స్ 140 ఉండగా.. ఇప్పుడు 110కి తగ్గింది. అలాగే, బీపీ అప్పుడు కేవలం 60/40 ఉండగా.. ఇప్పుడు 100/60 మెయింటైన్ అవుతోంది.

గుండె పనితీరు బాగుందని డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్, సీఆర్ఆర్టీ సపోర్ట్ పైనే.. సౌమ్య స్పృహలోకి వచ్చినప్పటికీ.. ఆమె ఇంకా వెంటిలేటర్ సపోర్ట్ (30% ఆక్సిజన్ సాచురేషన్) మీదే ఉంది.

కిడ్నీ పనితీరుకు సంబంధించి కంటిన్యూయస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ (సీఆర్ఆర్టీ) ద్వారా చికిత్స అందిస్తున్నారు. పొట్ట భాగంలో స్కానింగ్ చేయగా.. లివర్ కు గాయమైనట్లు తేలింది.

నిన్నటి నుంచి ఆమెకు రక్తం ఎక్కించడంతో పాటు, 2 యూనిట్ల ఎఫ్ఎఫ్ పీ, 4 యూనిట్ల ప్లేట్ లెట్స్ ఎక్కించారు. కండిషన్ కొంచెం ఇంప్రూవ్ అయినప్పటికీ, సౌమ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు.

ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో, యూరాలజీ డిపార్ట్మెంట్లకు చెందిన సీనియర్ డాక్టర్ల బృందం ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆమెకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button