
మేడారం నిధులపై మంత్రి పొంగులేటి సంచలనం: కేంద్రంపై తీవ్ర విమర్శలు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి నిధుల విషయంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, మేడారం అభివృద్ధికి కేంద్రం నయా పైసా సాయం చేయలేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మేడారం శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ. 250 కోట్లకు పైగా వెచ్చిస్తోందని, భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
కేంద్రం నుంచి సహకారం లేకపోయినా, మేడారాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని, ఏడాది పొడవునా భక్తులు వచ్చేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, నిధుల విషయంలో కేంద్రం అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు



