
ఏన్కూరులో సబ్జెక్టు వైస్ కాంప్లెక్స్ సమావేశాలు
మూడు మండలాల ఉపాధ్యాయులతో శిక్షణ కార్యక్రమం
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 30 2026:రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆదేశాల మేరకు ఏన్కూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ (ZPHS) హైస్కూల్‌లో సబ్జెక్టు వారీ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం ఏన్కూరు, తల్లాడ, కల్లూరు మండలాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడు మండలాల స్థాయి సమావేశంగా కొనసాగుతోంది.

ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను మరింత పెంపొందించడం, తరగతులు 6 నుంచి 10 వరకు విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం అని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
సబ్జెక్టు వారీగా నిర్వహిస్తున్న ఈ శిక్షణలో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
శిక్షణలో భాగంగా లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (LIP) అమలు విధానాలు, విద్యార్థుల అంచనా పరీక్షల ఫలితాల విశ్లేషణ, అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులకు అనుసరించాల్సిన బోధనా వ్యూహాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు.
అలాగే తరగతి గదుల్లో అమలు చేయదగిన వినూత్న బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు ప్రాయోగిక అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సబ్జెక్టు వైస్ కాంప్లెక్స్ సమావేశాలను రిసోర్స్ పర్సన్లుగా ఇందిరాని, అమరం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
మోడల్ లెసన్ ప్రదర్శనలు, పరస్పర చర్చల ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శకత అందిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల సామర్థ్యం మరింత పెరిగి, తరగతి గదుల్లో నాణ్యమైన బోధన అమలుకు దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.



