
మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై దాడి
మేడారం మహాజాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క ఆగమనం తర్వాత కరెంటు పోవడంతో పరిస్థితి అదుపుతప్పింది.
ఈ క్రమంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. చిలకల గుట్ట నుంచి మేడారానికి సమ్మక్క తరలివచ్చింది. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షల మంది భక్తులు ఉన్న సమయంలో ఇలా కరెంట్ పోవడంతో పోలీసులు కూడా టెన్షన్ పడ్డారు. కొంతసేపటికి కరెంట్ వచ్చినా అప్పటికే భక్తులు ఆగ్రహించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.
ఆదివాసీ జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం గురువారం ఉద్విగ్న క్షణాలకు వేదికైంది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు.
గురువారం ఒక్కరోజే సుమారు 30 లక్షల మంది మేడారం చేరుకున్నట్లు అంచనా. అయితే సమ్మక్క ఆగమనం అనంతరం భక్తులు గద్దెల వద్దకు వస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా కరెంటు పోవడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు.
ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గందరగోళ సమయంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




