
హైదరాబాద్‌లో విషాద ఘటన
రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
చర్లపల్లి – ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయానికి, రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను చూసి వాకీటాకీ ద్వారా సమాచారమిచ్చిన గూడ్స్ రైలు లోకోపైలట్. ఘటనా స్థలానికి చేరుకుని మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి(38), విశాల్ రెడ్డి, చేతన రెడ్డిలుగా గుర్తించిన పోలీసులు.
విజయశాంతి తన కూతురు చేతన(ఇంటర్ సెకండ్ ఇయర్), కొడుకు విశాల్ రెడ్డి(ఇంటర్ ఫస్ట్ ఇయర్)లతో కలిసి ఉంటుందని, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడని పోలీసుల నిర్ధారణ. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మృతుల్లో తండ్రి, తల్లి, కుమార్తె ఉన్నట్లు సమాచారం. వీరిని బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పి.సురేందర్‌రెడ్డి, విజయ, చేతనరెడ్డిగా గుర్తించారు.
మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారుమృతుల వద్ద రైల్వే టికెట్లు, విలువైన వస్తువులు లేవని జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు జీఆర్‌పీ క్రైమ్ నంబర్ 57/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఇంకా ఇతర కారణాలా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబం ఆత్మహత్యతో బోడుప్పల్ హరితహారం కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



