
హైదరాబాద్ లో కాల్పుల కలకలం…
హైదరాబాద్ మహా నగరంలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. కోఠీలోని ఎస్‌బీఐ కార్యాలయం వద్ద దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి గాయాలయ్యాయి.
శనివారం ఉదయం రషీద్ అనే వ్యక్తి ఉదయం 7గం. ప్రాంతంలో డబ్బు డిపాజిట్ చేయడానికి కోఠి హెడ్ ఆఫీస్ బయట ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన దుండగులు.. తుపాకీతో బెదిరించారు.

ఈ క్రమంలో రషీద్‌ను ఫాలో అయిన గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపి రూ.6 లక్షల డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బులెట్ గాయమైంది.
పెనుగులాట జరగడంతో.. కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. ఆపై దుండగులు నగదుతో పారిఏపోయారు. గాయపడిన రషీద్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న సుల్తాన్‌బజార్ పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.



