KhammamPoliticalTelangana

గొంతెమ్మ కోర్కెలొద్దు.. పొత్తులపై తేల్చేసిన పొంగులేటి

గొంతెమ్మ కోర్కెలొద్దు.. పొత్తులపై తేల్చేసిన పొంగులేటి

గొంతెమ్మ కోర్కెలొద్దు.. పొత్తులపై తేల్చేసిన పొంగులేటి

మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా కొనసాగిన పార్టీలు ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పొత్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు.

ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాబపురం మున్సిపాలిటీలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన పొంగులేటి..

కలిసి వచ్చే పార్టీలకు కాంగ్రెస్ తలపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. గొంతెమ్మ కోరికలు కోరకుండా కలిసి వచ్చే ప్రతి రాజకీయపార్టీని కాంగ్రెస్ గతంలో మాదిరిగా కలుపుకుని పోతుందన్నారు.

మున్సిపల్ ఎన్నికలు దొరల పాలనకు చరమగీతం పాడే సెమీ ఫైనల్స్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఏం చేస్తారో బీఆర్ఎస్ చెప్పాలన్నారు.

ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజలతో మమేకమైన వారికే పార్టీ బి-ఫామ్స్ ఇస్తుందన్నారు. గ్రామ పంచాయతీలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button