
తల్లి పిల్లల ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ లభ్యం..
మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చెంగిచర్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయ (35), తన ఇద్దరు పిల్లలు విశాల్ (17), చేతన (18) తో కలిసి చర్లపల్లి-ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
చెంగిచర్లకు చెందిన విజయ (35) తన ఇద్దరు పిల్లలు విశాల్(17), చేతన (18) తో కలిసి ఇవాళ తెల్లవారుజామున చర్లపల్లి-ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
సాఫ్ట్ వేర్ ఇంజినీరు గా పని చేస్తున్న విజయ.. హాస్టల్ లో ఉంటున్న తన ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి మరీ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ లో విజయ పార్క్ చేసిన కారులో సూసైడ్ లేఖ లభ్యమైంది.
నాతో పాటే నా పిల్లలు : నా జీవితం నచ్చట్లేదు.. బతకాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. పిల్లల్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. నాతో పాటే పిల్లలను తీసుకువెళ్తున్నా.. క్షమించు అమ్మా’ అంటూ రాసి ఉన్న లెటర్ కారులో లభించచింది.
విజయ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏమి లేవని విజయ తల్లి మీడియాతో వెల్లడించారు. విజయ భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటున్నారని, నాలుగు నెలలుగా ఆయన ఇండియాకు రాలేదని చెప్పారు.
అయితే కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు ఫ్యామిలీ అంతా అన్యోన్యంగా ఉంటే విజయ ఇలాంటి డేంజర్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ తల్లీబిడ్డల సూసైడ్ వెనుక ఏం మిస్టరీ తేలబోతోంది అనేది చూడాలి.



