HyderabadNizamabadPoliticalTelangana

8 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య…

8 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య…

8 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య…

నిజామాబాద్ కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య కన్నుమూసింది.
ఎనిమిదిరోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు శనివారం రాత్రి కన్నుమూశారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సౌమ్య జనవరి 23న గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు మాధవ్‌నగర్‌ వద్ద మాటువేశారు. గంజాయి తో వస్తున్న కారును ఆపి తనిఖీలు చేసేందుకు ప్రయత్నించగా, కారులో ఉన్న వ్యక్తులు ఆమెను ఢీకొట్టారు.

తీవ్రంగా గాయపడిన సౌమ్యను తొలుత నిజామాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో 25వ తేదీన హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూఆ శనివారం రాత్రి 9.45 గంటలకు మృతి చెందారు. ఆమె మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం మోస్రాలో సౌమ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button