KhammamPoliticalTelangana

అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం’!

అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం’!

అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం’!

ఏదులాపురం మున్సిపల్ పోరులో ‘హస్తం’ దూకుడు

బీ-ఫామ్‌లు అందజేసి…అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన మంత్రి పొంగులేటి

ఏదులాపురం : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం అభ్యర్థుల చేతికి బీ-ఫామ్‌ లు అందజేశారు. దీంతో మున్సిపల్ కోటపై ‘హస్తం’ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచార పర్వం ఊపందుకుంది.

గెలుపే లక్ష్యంగా గడప గడపకూ.. బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు నామినేషన్లు సమర్పించాలని మంత్రి సూచించారు.

“అధికారికంగా బీ-ఫామ్‌లు అందాయి.. ప్రభుత్వ ప్రజారంజక పాలనను, అమలు చేస్తున్న గ్యారంటీలను వివరించి ఓటర్ల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.

క్లీన్ స్వీపే టార్గెట్ ! వార్డుల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఏదులాపురంలోని అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేతుల మీదుగా బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచార క్షేత్రంలోకి అడుగుపెట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button