KhammamPoliticalTelangana

టైం దాటాక బీజేపీ అభ్యర్థి మాయం.. ఇది ప్రజాస్వామ్య ఖూనీ కాదా?

టైం దాటాక బీజేపీ అభ్యర్థి మాయం.. ఇది ప్రజాస్వామ్య ఖూనీ కాదా?

ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా?

ఓటమి భయంతోనే కిడ్నాప్ పర్వం.. ప్రతిపక్షాల పిరికిపంద చర్య.

టైం దాటాక అభ్యర్థి మాయం.. ఇది ప్రజాస్వామ్య ఖూనీ కాదా?

దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి.. కిడ్నాపులు కాదు!

కూటమి కుట్రలు సాగవు.. ఆ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలి.

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బీజేపీ అభ్యర్థి కిడ్నాప్

కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజం.

ఖమ్మం / ఏదులాపురం

ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, కిడ్నాప్ రాజకీయాలకు తెరలేపాయని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్, తోక పార్టీలైన కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై బీజేపీని ఎదుర్కోలేక నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో భారతీయ జనతా పార్టీ తరపున నిలబడిన అభ్యర్థిని, నామినేషన్ల ఉపసంహరణ గడువు (మధ్యాహ్నం 3 గంటలు) ముగిసిన తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని నెల్లూరి ఆరోపించారు.

మా నాయకుల సమక్షంలో ఉన్న అభ్యర్థిని టైం దాటిన తర్వాత ఎత్తుకెళ్లడం రౌడీ రాజ్యానికి నిదర్శనమన్నారు. కుటుంబ సభ్యులను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి విత్ డ్రా చేయించుకోవాలని చూడటం హేయమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు.

దమ్ముంటే ప్రజల్లో తేల్చుకోండి.. “మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్లి, వారి ఆశీర్వాదంతో గెలవాలి తప్ప.. ఇలా అభ్యర్థులను కిడ్నాప్ చేసి కాదు,” అని నెల్లూరి సవాల్ విసిరారు.

నైతికంగా బీజేపీ ఇక్కడ గెలిచిందని, అభ్యర్థులను మాయం చేసినంత మాత్రాన ప్రజాభిమానాన్ని మాయం చేయలేరని స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే బీజేపీ కార్యకర్తలు ఇటువంటి బెదిరింపులకు లొంగరని హెచ్చరించారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. ఈ ఘటనపై పోలీసులకు , రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కిడ్నాప్ కు పాల్పడిన పార్టీ అభ్యర్థిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, పోటీ చేసే హక్కును కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని, దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారనే భయంతోనే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ లు ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని, రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరించారు.

బిజెపి రాష్ట్ర నాయకులు, పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నున్న రవికుమార్ అధికారం చేతిలో ఉందని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఇలాంటి గూండాయిజాన్ని ఖమ్మం ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు.

అభ్యర్థులను మాయం చేయగలరేమో గానీ, ఓటర్ల మనసులో ఉన్న బీజేపీని తొలగించలేరని సవాల్ విసిరారు. కిడ్నాప్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే వరకు ఎన్నికల సంఘం వద్ద, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని అన్నారు.

మీడియా సమావేశంలో ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ సరికొండ విద్యాసాగర్ రెడ్డి, పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నున్న రవికుమార్, ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ నగరికంటి వీరభద్రం , కోకన్వీనర్లు రవి రాథోడ్,రజిని రెడ్డి, జిల్లా కోశాధికారి కొనతం లక్ష్మీనారాయణ, ఏదులాపురం మున్సిపాలిటీ నాయకులు కోటమ్మర్ది సుదర్శన్, సాగర్, శాసనాల సాయిరాం, ధాన్య నాయక్ , నున్న వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button