National

భార్య అందంగా కనిపించవద్దని గుండు కొట్టిన భర్త…

భార్య అందంగా కనిపించవద్దని గుండు కొట్టిన భర్త…

భార్య అందంగా కనిపించవద్దని గుండు కొట్టిన భర్త…

Web desc : భార్య అందంగా ఉంటే ఎవరైనా సంతోషిస్తారు కానీ ఓ భర్తకు మాత్రం తన భార్య అందంగా ఉండటం తలనొప్పిని తీసుకువచ్చింది.

అందరూ తన భార్యనే చూడటంతో తట్టుకోలేకపోయాడు. భార్య అందంగా ఉందని మురిసిపోవాలో పక్కవాళ్లు ఆమెనే చూస్తున్నారని బాధపడాలో అర్థం కాలేదు. దానికి తోడు అనుమానం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

భార్యను ఎలాగైనా అందవిహీనంగా ఎవరి కన్ను పడకుండా చేయాలని అనుకున్నాడు. దాని కోసం ఆమెకు ఏకంగా గుండు గీసేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట జిల్లా తొదలబాగిలో చోటు చేసుకుంది.

ఉమేశ్, లక్ష్మీ బాయి ఇద్దరూ భార్య భర్తలు. అయితే భార్యకు పొడవాటి జడ ఉండటం వాటిని ఆమె అందంగా అలంకరించుకోవడం చూసి ఉమేశ్ ఓర్చుకోలేకపోయాడు. తన భార్య యువకులను ఆకట్టుకుంటోందని అనుమానంతో రగిలిపోయాడు.

ఇది ఇలానే కొనసాగితే తన కొంప కొల్లేరు అవుతుందని అనుకున్నాడో ఏమో గానీ సోమవారం రాత్రి ఇంటికి ఫుల్లుగా తాగి వచ్చాడు. భార్యతో గొడవపడగా చివరకు చెరుకు నరికే రేజర్ కత్తితో ఆమెపై బెదిరింపులకు పాల్పడి గుండు చేశాడు.

బాధితురాలి రోదనలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. లక్ష్మీబాయి పడుతున్న మానసిక, శారీరక వేదనను చూసి చలించిపోయిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మహిళా సంఘాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. కేవలం జుట్టు విషయంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అతనిలోని మానసిక వైకల్యానికి పరాకాష్ట అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు ఉమేష్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమెకు తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పోలీసులు, నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గృహ హింస, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button