KhammamPoliticalTelangana

అక్కినాపురం తండాలో చోరీ… బీరువా పగలగొట్టి నగదు, వెండి అపహరణ

అక్కినాపురం తండాలో చోరీ… బీరువా పగలగొట్టి నగదు, వెండి అపహరణ

అక్కినాపురం తండాలో చోరీ… బీరువా పగలగొట్టి నగదు, వెండి అపహరణ

సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు

ఫిబ్రవరి 05 2026: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అక్కినాపురం తండా గ్రామంలో దుండగులు చోరీకి పాల్పడి భారీ మొత్తంలో నగదు, వెండి ఆభరణాలను అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు బుధవారం పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, ఇదే అవకాశంగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు.

ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న పది తులాల వెండి వస్తువులు మరియు లక్ష రూపాయల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు.


సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్న తర్వాత బీరువా పగలగొట్టిన స్థితిలో ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు.

వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.

చోరీ జరిగిన తీరు, ఇంటి పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button